ఈరోజు ఢిల్లీ గో మహాపాదయాత్ర లో అటా అనే ప్రాంతం నుండి నడిచి వెళుతుండగా జైన మతానికి చెందిన ( సన్యాసం స్వీకరించిన) మహిళా తల్లులు " అహింసా పరమో ధర్మః" అంటూ దారిలో మాతో కలవడం జరిగింది.
గో హత్యలు ఆపు చేయాలని, వాటితో పాటు జీవ హింస చేయకూడదని జైన మత గురువులు వారి ప్రవచనాలలో తెలియజేస్తారని వారు గోశాలలు కూడా నిర్వహిస్తారని జైన్ మాతలు తెలియజేసారు.
మహా యజ్ఞంలా చేస్తున్న గో మహా పాదయాత్ర ను వారు అభినందించారు.
Copyright © 2021. Mahayagnam All reserved