అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అఖిలభారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో "గో మహిళా దినోత్సవం " అను పేరు తో గో సేవలు చేస్తూ, గోవుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహిళలను గౌరవిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారిని సత్కరించి, వారికి అవు పేడ తో తయారైన ఉత్పత్తులను అందజేశారు.
గో మహిళా దినోత్సవం చేయడం చాలా విశేషమని, ప్రపంచంలోనే మొదటి సారిగా మహిళా గో సేవకులను,. మహిళా గో ప్రేమికులను గౌరవించిన ఏకైక సంస్థ అఖిలభారత గో సేవా ఫౌండేషన్ అని కొనియాడారు.
బాలకృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో మహిళా గో సేవకులను గుర్తించి 18 మందిని మహిళలను హిమాయత్ నగర్ లోని ప్లాటినమ్ లో సత్కరించారు.
Copyright © 2021. Mahayagnam All reserved