జై గోమాత
గో మహాపాదయాత్ర DAY -1
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు,మాజీ పోలీసు అధికారి శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు, భగవద్గీత ఫౌండేషన్ శ్రీ గంగాధర శాస్త్రి గారు, స్వామీజీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి తిరుమల గో మహా పాదయాత్ర ప్రారంభించారు. అన్ని హిందూ సంఘాలు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు RSS గో సేవా ప్రముఖులు,బజరంగ్ సేన, గోశాల నిర్వాహకులు,మార్వాడి, గుజరాతిలు, అయ్యప్ప భక్తులు,మా ఆత్మీయులు అందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు.
మొదటి రోజు పాదయాత్ర టిటిడి హిమయత్ నగర్ నుండి బయలుదేరి రాత్రికి శాతం రాయి,శంషాబాద్ కు చేరుకున్నాము.
యాత్రకు వచ్చి దీవించిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు
మీ బాలకృష్ణ గురు స్వామి అఖిలభారత గో సేవ ఫౌండేషన్
Copyright © 2021. Mahayagnam All reserved